calender_icon.png 4 November, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తాం

03-11-2025 06:28:04 PM

బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంట్రాక్టులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు హెచ్చరించారు. సోమవారం బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పాటు పలుశాఖల అధికారులకు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికై బిల్లుల విషయమై మంత్రులు. ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి విన్నవించడం జరిగింది. ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని వాపోయారు. నవంబర్ 30లోపు తమ బిల్లుల చెల్లించకుంటే  డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.