calender_icon.png 4 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

03-11-2025 06:14:44 PM

ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి యాకుబ్ 

మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా దేహదారుడ్యం పెంపొందడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి ఎండి యాకుబ్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జోనల్ స్థాయి అండర్ 17 కరాటే జట్టు ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లా డారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని తద్వారా రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా రాణిస్తారని అన్నారు.

ఈ పోటీలకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జోనల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు త్వరలో పెద్దపల్లి జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పెద్దన్న, పిడి చిన్నక్క, పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, సీనియర్ కరాటే మాస్టర్లు హరికృష్ణ, వెంకటేష్, నరేష్, సాహిత్, వంశి, క్రీడాకారులు పాల్గొన్నారు.