03-11-2025 06:34:22 PM
ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం ఎల్లారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ఎదురెదురుగా కారు బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి వెళుతున్న మాసిని సంగయ్య వెంకంపల్లి గ్రామ నివాసి బాన్సువాడ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో బైకు కారు ఢీ కొట్టుకోవడంతో గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.