calender_icon.png 4 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో చేపల వలకు చిక్కిన పెద్ద కొండచిలువ..

03-11-2025 06:16:38 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊర చెరువు వద్ద చేపల వలకు పెద్ద కొండచిలువ చిక్కింది. చెరువు వద్ద మత్స్యకారులు చేపలు తరలిపోకుండా కొద్ది రోజుల క్రితం పెద్ద జాలివల ఏర్పాటు చేశారు. సోమవారం ఆ జాలి వాల వద్ద చిక్కుకొని ఉన్న పెద్ద కొండచిలువను చూసిన స్థానికులు, రైతులు భయపడ్డారు. ఈ సంఘటన సుల్తానాబాద్ లో కలకలం సృష్టించింది.