03-11-2025 06:36:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసుల ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ సమస్యలు కౌన్సిలింగ్ లేదారా కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.