06-09-2025 01:31:06 AM
-బీఆర్‌ఎస్ ముషీరాబాద్ సీనియర్ నాయకుడు డీ శివ ముదిరాజ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): విద్యను బోధిస్తూ జ్ఞానాన్ని పెం పొందిస్తున్న ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని బీఆర్‌ఎస్ ముషీరాబాద్ సీనియర్ నాయకుడు డీ శివముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పుర స్కరించుకొని ముషీరాబాద్‌లోని ప్రముఖ రేడియెంట్ హైస్కూల్ ఉపాధ్యాయులను బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివ ముదిరాజ్, ఉపాధ్యాయులు సయ్యద్ అహ్మద్ భక్తియార్ తదితరులను సన్మానించి మాట్లా డారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు దేశ అభివృద్ధికి సహకారం అందించేలా ఉపాధ్యాయ పలు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎండీ మోహిన్, ఎయిర్టెల్ రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సదా, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, సలీం పాల్గొన్నారు.