24-01-2026 01:12:44 AM
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న కొత్త సినిమా ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం చేస్తూ చింతా వినీషరెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తు న్నారు. ఈ చిత్రంలో కీరవాణి ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే పాట ఇటీ వల విడుదలై, సంగీత, సాహిత్యప్రియులను రంజింపజేస్తోంది.
ఈ సాంగ్ సక్సె స్ సెలబ్రేషన్స్‌ను టీమ్ శుక్రవారం ఏర్పాటుచేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుందని మేకర్స్ ఇదే వేదికపై ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. “నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా చిన్న సమస్యలకే ఆత్మహత్య వరకూ వెళ్లేవాళ్లలో స్ఫూర్తి నింపే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది” అన్నారు.
హీరో వంశీ మాట్లాడుతూ.. “సంగీతం మా సినిమా స్థాయిని వంద రెట్లు పైకి తీసుకెళ్లింది. మంచి ఎమోషనల్ రైడ్ ఈ సినిమా” అని చెప్పారు. ‘ఈ ఫీల్‌గుడ్ స్టోరీ మలయాళం సినిమా వైబ్ ఉంటుంద’ని హీరోయిన్ సంధ్య తెలిపింది. ‘సినిమాను ఫైనల్ మిక్సింగ్‌లో చూసుకుని ఏడ్చాన’ని డైరెక్టర్ వినయ్త్న్రం చెప్పారు. ‘పెద్ద సినిమాకు తీసిపోని చిత్రమిద’ని నిర్మాత గోపాలకృష్ఱ తెలిపారు. సంగీత దర్శక ద్వయం చందు, రవి, చిత్రబృందం కూడా ఈ వేడుకలో మాట్లాడారు.