calender_icon.png 19 May, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగవైకల్యాన్ని జయించిన ఓ విద్యార్థి..

19-05-2025 05:09:14 PM

కాళ్లతో పరీక్ష రాసిన డిగ్రీ విద్యార్థి శంకర్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా ఆ విద్యార్థి ఏనాడు కుంగిపోలేదు. ఆత్మస్థైర్యాన్ని అంతకంటే కోల్పోలేదు. బాల్య విద్య నుంచే పట్టుదలతో అంచేలంచలుగా చదువుతూ డిగ్రీ ఫైనల్ ఇయర్ కు చేరుకున్నాడు. రెండు చేతులు లేకున్నా బెల్లంపల్లి డిగ్రీ కళాశాల(Bellampally Government Degree College)లో సోమవారం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నేన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఎల్లూర్ శంకర్ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ అభ్యసిస్తున్నాడు.

అంగవైకల్య విద్యార్థి శంకర్ తోటి విద్యార్థులతో కలిసి ఫైనల్ ఇయర్ పరీక్షకు హాజరయ్యాడు. రెండు చేతులు లేవనీనిబ్బరాన్ని కోల్పోలేదు. అందరిలాగే సాదాసీదాగా కాళ్లతో పరీక్ష రాశాడు.  కృషి పట్టుదల లక్ష్య సిద్ధి ఉంటే సరి పరీక్ష ఎలాగైనా రాయచ్చని చేతులు లేని ఆ విద్యార్థి శంకర్ కాళ్లతో పరీక్ష రాసి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అన్నాడో కవి. కృషి పట్టుదలతో అంగవైకల్యాన్ని జయించిన విద్యార్థి శంకర్ పరీక్ష రాసి చర్చనీయాంశంగా మారాడు. ఆధ్యంతం ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆదర్శంగా నిలిచాడు.