calender_icon.png 19 May, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా 40 శాతం చెల్లించాలి..

19-05-2025 05:05:50 PM

సింగరేణి డైరెక్టర్ (పీపీ)పా వెంకటేశ్వర్లకీ బీఎంఎస్ నేతలు యాదగిరి సత్తయ్య, సారంగపాణి వినతి..

మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు ప్రకటించిన 40 శాతం లాభాల వాటను ఎలాంటి జపం చేయకుండా చెల్లించాలని బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి కోరారు. సోమవారం సింగరేణి డైరెక్టర్ అండ్ ప్లానింగ్ ప్రాజెక్టు డైరెక్టర్(పా) కొప్పుల వెంకటేశ్వర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సింగరేణి పరిశ్రమ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి వాస్తవ లాభాలపై వాటా 40% జాప్యం లేకుండా చెల్లించాలని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పరంగా 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగిసింది.

ఇప్పటి వరకు ప్రకటించని వాస్తవ లాభాలు, జాప్యం లేకుండా వెంటనే ప్రకటించి 40% వాటాను పంపిణీ చేయటానికి ఆదేశాలు జారీ చేయాలని సంస్థ డైరెక్టర్ (పా) రామగుండం పర్యటనలో కలిసి చర్చించినట్లు తెలిపారు. 2023-24  ఆర్థిక సంవత్సరంలో 70.12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే 37 వేల కోట్ల బిజినెస్ జరిగిందని, వాస్తవ లాభాలు లాభాలు రూ.4701 కోట్లు ప్రకటించి, సిఎస్ఆర్ నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మళ్లింపులు మినహాయింపులు రూ.2289 కోట్లు, పోను, రూ.2412 కోట్లలో దానిలో 33% అంటే రూ .795.96కోట్లను గత సంవత్సరం చెల్లించడం జరిగిందని తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరం కార్మికులు కష్టపడి రికార్డ్ స్థాయిలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 69.01మిలియన్ టన్నులు సాధించారని, వేల కోట్ల వ్యాపారం జరిగిందని, గత సంవత్సరం పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సాధించిన కార్మికుల కోసం ఈ సారి లాభాల వాటా 40% ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ఇచ్చిన లాభాల వాట వివరాలు..

- 2015-2016: 23%

- 2016-2017: 25%

- 2017-2018: 27%

- 2018-2019: 28%

- 2019-2020: 28%

- 2020-2021: 29%

- 2021-2022: 30%

- 2022-2023: 32%

- 2023-2024: 33%

కార్మిక కుటుంబాలకు పిల్లల చదువులు కాలేజీ హాస్టల్ స్కూల్స్ ఫీజులు చెల్లింపు కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందని, త్వరితగతిన పూర్తి చేసి జూన్ మాసంలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్టర్ పిపి ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను కలిసిన వారిలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్, నాయకులు రౌతు రమేష్, దొనీకిన రమేష్, తిరునహరి కిరణ్ కుమార్, సల్ల వేణు, పాక కృష్ణ, కందుల మహేష్, తదితరులు ఉన్నారు.