calender_icon.png 20 August, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.. వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

20-08-2025 05:43:14 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Congress Party In-charge Dr. Kota Neelima) ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బేగంపేట్ లో బ్లాంకెట్లు, బన్సీలాల్ పేట్ లో సబ్సిడీ ఆటోలు, అమీర్ పేట్ లో ఫ్రూట్స్, సనత్ నగర్ లో స్కూల్ పిల్లలకు బ్యాగ్స్, వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి నిర్ణయాలు రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్నవే అని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సద్భావన యాత్ర మొదలు పెట్టింది రాజీవ్ గాంధీ అని.. పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి కంప్యూటర్‌ను పరిచయం చేశారన్నారు. హైదరాబాద్‌ కంప్యూటర్ రంగంలో ముందుకు పోవడానికి కారణం ఆయనే అన్నారు. 18 ఏండ్లకే యువత పాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏండ్లకే యువకులకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఆయన ఆశయసాధన కోసం అందరూ ముందుకు పోతున్నారని.. అందుకే ప్రతి ఏటా ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు.