calender_icon.png 20 August, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారులకు నాణ్యమైన మందులు అందించాలి

20-08-2025 05:13:46 PM

కెమిస్ట్, డ్రగ్గిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్రావు

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): అనారోగ్యంతో ఉన్న రోగులకు నాణ్యమైన మందులు అందించాల్సిన బాధ్యత ప్రతీ మెడికల్ షాపు యజమానిపై ఉంటుందని కెమిస్ట్, డ్రగ్గిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు మోటూరి చంద్రశేఖర్రావు అన్నారు. బుధవారం స్థానిక విశ్రాంతి భవనంలో మండల కెమిస్ట్, డ్రగ్గిస్ట్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మోటూరి చంద్రశేఖర్రావు హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన జిల్లా యూనియన్ నాయకులను మండల యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యంతో ఉన్న వారికి ఉత్తమ సేవలు అందించి నాణ్యమైన మందులు అందించి వారికి సహాయం అందజేయాలన్నారు. ఫార్మసిస్టు పర్యవేక్షణలో మాత్రమే మందులను అమ్మాలని, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మరాదని, యాంటీబయాటిక్ మందులు డాక్టర ప్రిస్కిప్షన్తో మాత్రమే అమ్మాలని ఆయన సూచించారు. మందులు మనుషుల జీవితాలను కాపాడుతాయని, కావున వాటిని అందించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మందుల షాపులను ఎల్లప్పుడు నీట్గా ఉంచుకోవాలని, ఎక్సైరీ అయిన మందులను విడిగా ఉంచి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.