calender_icon.png 20 August, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా కట్టా రామ్ కుమార్

20-08-2025 05:15:46 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ ను బుధవారం 9 ఆటో పాయింట్ల కమిటీ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, దహెగాం, కొంచె వెళ్లి గ్రామాల ఆటో డ్రైవర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కేశ బోయిన శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడు సంవత్సరాల వరకు ఆటో యూనియన్ అధ్యక్షులుగా డ్రైవర్లు తనకు బాధ్యత అప్పజెప్పారని, ఆటో డ్రైవర్ల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ధనవంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కట్టా రామ్ కుమార్ తెలిపారు.