calender_icon.png 1 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయాధికారుల సర్వే

01-11-2025 06:48:08 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం తదితర అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఆయా పంటల రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం ఎక్కువగా జరిగిందని ఏఐవోలు పేర్కొన్నారు. రోజువారీగా పంటలను పరిశీలించి రిపోర్టులను అధికారులకు అందజేస్తామన్నారు. రామంచలో తాసిల్దార్ రమేష్ పంట సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో వ్యవసాయ విస్తరణ అధికారులు అఖిల, అంజలి, ఫరీద్, ప్రణయ్ సాయికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.