01-11-2025 06:45:14 PM
- పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు
- డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం మాజీ పర్సన్ ఇన్చార్జ్ గంజి ఆంజనేయులు చెప్పడం సరికాదని డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేను విమర్శిస్తూ మాట్లాడడం సబబు కాదన్నారు.
ఒకవేళ మీకు ఏమైనా బాధ కలిగితే సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేతో మాట్లాడాలి కాని ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు పర్యాయాలు కౌన్సిలర్లుగా గెలిచిన మీరు సొంత ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ లో చేరినప్పుడూ మీకు పార్టీ గుర్తుకు రాలేదాన్నారు. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడూ మీరు విడిచిపెట్టి పోయారని అన్నారు. ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. సమావేశంలో నాయకులు మైత్రి యాదయ్య, రామకృష్ణ, తిరుమల వెంకటేష్, నాచ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.