calender_icon.png 14 September, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర విద్యాభివృద్ధికి సుస్థిర ప్రణాళిక!

25-06-2025 12:00:00 AM

మామిడి వెంకన్న :

విద్య వ్యక్తి సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది. అది సామాజిక చైత న్యానికి ఒక సాధనం. సామాజిక, నైతిక విలువ, క్రమబద్ధమైన మానవ జీవన విధానానికీ విద్య ఉపయోగపడుతుంది. అది భవితకు చక్కని మదుపే కాని, ఖర్చు కాదు. మానవ సామర్థ్యంపైనా విద్య ప్రభావం చూపుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు కావస్తున్నా ఇంకా విద్యారంగంలో మనం అనుకున్నంత వృద్ధిని సాధించలేదు.

ఇన్నేండ్లలో 72 కమిషన్లు, కమిటీలను విద్యకు సంబంధించిన విషయాలపై నియమించుకొన్నాం. అయినా, ఎలాంటి ఫలితాత్మక ప్రత్యేకతను సాధించిన పరిస్థితి మాత్రం ఊహించినంత అశాజనకంగా లేదు. వయోజన అక్షరాస్యత రేటు, ప్రాథమిక స్థాయి నమోదు నిష్పత్తి ఆధారంగా పరిశీలిస్తే.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా దేశాలు 100 శాతం సాధించాయి.

మన దేశం.. 7వ స్థానంలో వయోజన అక్షరాస్యత రేటు 61 శాతం, ప్రాథమిక స్థాయి నమోదు నిష్పత్తి 90 శాతం కలిగి ఉంది. నిత్యం దాడులతో సతమతమవుతున్న శ్రీలంక సైతం 90.7 శాతం, 97 శాతం నిష్పత్తిని సాధించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి మనం ఎంతగానో శ్రమించాల్సిన అవసరం వుంది. 

విద్యార్థుల నమోదులో రెండోస్థానం

ఈ పరిస్థితికిగల కారణాలను కొన్నింటి ని చెప్పుకోవచ్చు.  ఇటీవలి కాలంలో ఉపా ధి రంగంలోని మార్పుల కారణంగా ప్రతి భ, బోధనార్హత, నైపుణ్యాలు కలిగిన వారు ఉపాధ్యాయ వృత్తికి దూరమయ్యారు. దీనివల్ల ప్రతిభ కలిగిన ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దేశ జనాభాలో 35 కోట్ల మంది నిరక్షరాస్యులు కావడమేకాక 10వ తరగతి వచ్చేసరికి దాదాపు 80 శాతం విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు.

మొదటి పంచవర్ష ప్రణాళికల్లో మొత్తం బడ్జెట్‌లో నిధులు విద్యా రంగానికి 7.2 శాతం కేటాయించగా, 10వ పంచవర్ష ప్రణాళికలో కేవలం 2.9 శాతం మాత్రమే కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యకోసం రమారమి 6 శాతం కేటాయిస్తుండ గా, అభివృద్ధి చెందిన దేశాల్లో 11 శాతం వరకూ కేటాయింపులు జరుగుతున్నాయి.

ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ మన దేశం అందరికీ విద్యను అందించడాన్ని ముఖ్య ఉద్దేశంగా భావిస్తోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతా శాతం 61.11గా వుంది. ఏ దేశ అభివృద్ధి స్థాయి అయినా అక్షరాస్యత పెరుగుదలపైనే ఆధారపడి వుంటుంది. 

విద్య, ఆర్థిక పరమైన వివిధ స్థాయిలకు అవసరమైన మానవ వనరులు అక్షరాస్యత ద్వారానే లభ్యమవుతాయి. దేశవ్యా ప్తంగా నిర్వహించిన ‘అసర్’ సర్వే రిపోర్టు (యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్టు) ఆధారంగా మన రాష్ట్రం ప్రాథమిక విద్యాస్థాయిలో నాణ్యత కలిగి ఉందని, బోధనా పరంగా ఎంతో మెరుగ్గా వుందని తెలిపిం ది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సులోని పిల్లలు అందరికీ అవసరమైన, నాణ్యమైన విద్యను అందిస్తుందని వ్యా ఖ్యానించింది.

6 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 95.9 శాతం మంది పాఠశాలల్లో నమోదైనారు. ప్రీ ప్రైమరీ విద్యలో 3 సంవత్సరాల వారు 89.4 శాతం మంది నమోదైనారు. బడి బయటి పిల్లల సంఖ్య బాగా తగ్గింది. దేశం లో 3వ స్థానంలో, దక్షిణ భారతదేశంలో నూ 3వ స్థానంలో ఉన్నది.

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గినప్పటికీ దేశంలో 2వ స్థానంలో ఉన్నది. మన రాష్ట్రం దిగువ తరగతులలో భాషాభ్యాసంలో 9.7 శాతం అభివృద్ధిని కలిగి వుంది. గణిత అభ్యాసంలో 9.4 శాతంతో దక్షిణ భారతదేశం లో కెల్లా అత్యధిక అభివృద్ధి కలిగి వుంది. 

జాతీయ సగటులో గణనీయ ప్రగతి

మొట్టమొదటిసారి జాతీయ సరాసరిలోని అన్ని సూచికలలో మన రాష్ట్రం మం చి అభివృద్ధిని ప్రదర్శించింది. రాష్ట్రం లో మొత్తం 93,768 పాఠశాలల్లో 74,587 ప్రభుత్వ పాఠశాలలు అంటే 75 శాతం పాఠశాలలు ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. 25 లక్షల మంది ఉపాధ్యాయు లు ప్రభుత్వ పాఠశాలల్లో నూ, 1.5 లక్షలమంది ప్రైవేటు పాఠశాల ల్లో పని చేస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 85,04,197 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే 48,42,423 మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేటు పాఠశాలల సంఖ్య తక్కువ గా ఉన్నప్పటికీ విద్యార్థుల నమోదు మా త్రం ఎక్కువనే చెప్పాలి. దీనిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాస్థాయిని, భౌతిక వనరులను మెరుగు పరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు సాగిస్తోంది.

వీటిలో భాగం గా బడిబాట, జాతీయ ఎలిమెంటరీ స్థా యి, బాలికా విద్యా కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఎంపిక చేసిన పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల వారికి వృత్తి శిక్షణా కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం ఉన్నత స్థాయి వరకూ కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నది. 12,000 కంప్యూ టర్లను వివిధ పాఠశాలలకు అందించి, విద్యార్థులకు కావలసిన శిక్షణను అందిస్తున్నారు.

ఇందుకోసం 2,27,99 కోట్ల రూపాయల ద్వారా ‘బిల్ట్- ఓన్- ఆపరేటర్- సిస్టమ్’ (బూట్) విధానాన్ని అధికారులు అమలు పరుస్తున్నారు. ప్రభు త్వ, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు కావలసిన ఫర్నీచర్, సైన్స్ మెటీరియల్స్ సరఫరా చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ఆరోగ్యకర పరిస్థితులు నెలకొల్పడానికి తా గునీరు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఆటస్థలం, పరిశుభ్రత, పచ్చదనం, వంటగదుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. 

సాధించవలసింది ఇంకెంతో ఉంది!

బడి బయటి పిల్లలందరూ బాల కార్మికులే. ఇంకా లక్షమంది పిల్లలు బడి బయ టే వున్నారు. గణాంకాల ప్రకారం 25 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావడం లేదు. వారంతా వివి ధ రకాలైన విధులు నిర్వర్తిస్తున్నారు. పర్యవేక్షణ అధికారులైన ఉపవిద్యాశాఖాధికా రులు, మండల విద్యాశాఖాధికారులు, ప్ర ధానోపాధ్యాయులు, 50 శాతం మంది డైరెక్టు నియామక ప్రతిపాదన ద్వారా భర్తీ చేయాల్సిన అవసరం వుంది.

50 శాతం ఖాళీలు ఏర్పడటంతో విద్యార్థుల పర్యవేక్షణ, బోధన కొరవడినట్లు విమర్శలు వస్తు న్నాయి. ఇప్పటి వరకు మండల విద్యాధికారులకు, ఎంఆర్‌పీలు సహాయకారులు గా వ్యవహరించే వారు. కానీ, ఇప్పుడు వారు లేక ఎంఈఓలు ఒక్కరే పని చేయాల్సి వస్తోంది. పనిభారం వల్ల కూడా విద్యారంగంలో పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తున్నది.

పిల్లలను బడికి పంపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయింద ని భావించడం, వారు తమ పిల్లల విద్య, అభివృద్ధి పట్ల ఎప్పటి కప్పుడు శ్రద్ధ వహించక పోవడం, పాఠశాల్లో నిర్వహించే సమావేశాలకు వారు హాజరు కాకపోవడం, దీనివల్ల పిల్లల మానసిక, సామాజి క సమస్యలను చదువులో వెనుకబాటుతనానికి సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కారాలను సాధించలేక పోవడం జరుగుతోంది.

పాఠశాలలను సందర్శించే తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు స్కూళ్ల అభివృద్ధి కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఉపాధ్యాయులు ప్రణాళికలను రూపొందించుకో వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో, విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. వారం తా విధిగా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలి. నిర్దుష్ట సమయానికి సిలబస్ పూర్తి చేయాలి. అభ్యాసానికి కావలసి న అనుకూల వాతావరణం ఏర్పరచాలి. తల్లిదండ్రులతో చర్చించి పిల్లల సామాజిక, మానసిక, భౌతిక సమస్యలను పరి ష్కరించడానికి సలహాలు ఇవ్వాలి.

ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించి విద్యా విషయక, విద్యేతర విషయాలకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజే యాలి. పూర్తి అంకితభావంతో విధులు నిర్వహించాలి. విద్యార్థులు కూడా రెగ్యులర్‌గా పాఠశాలలకు హాజరు కావాలి. పా ఠ్యాంశాలకు సంబంధించిన మూల్యాంకనం నిరంతరం చేసుకోవాలి.

సరైన వైఖ రులను పెంపొందించుకొని, ఉత్తమ పౌరులుగా రూపొందాలి. విద్యాధికారులు ఆడి యో, వీడియో కాన్సరెన్సులు నిర్వహించాలి. విద్యారంగం ప్రణాళికలలోని అన్ని అంశాల్లో కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రోత్సహించాల్సిన అవసరమూ ఉంది.