calender_icon.png 9 January, 2026 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది నిమిషాల డెలివరీతో చిక్కులెన్నో!

08-01-2026 12:00:00 AM

నగరాల్లో ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ సర్వసాధారణం అయింది. కేవలం ఒక్క క్లిక్‌తో సరుకులు ఇంటికి చేరుతున్నాయి. ఈ వేగం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. వేగంగా డెలివరీ చేసే క్రమంలో డెలివరీ బా య్స్ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో పని చేస్తున్న వారికి సరైన రక్షణ లభించడం లేదు. భారతదేశంలో గిగ్ ఎకానమీ చట్టాల కంటే వేగంగా విస్తరించింది. ప్రస్తుతం దేశం లో దాదాపు 80 లక్షల మంది గిగ్ కార్మికు లు ఉన్నారు. వీరి సంఖ్య భవిష్యత్తులో ఇం కా పెరిగే అవకాశముంది. డెలివరీ యాప్స్ ద్వారా యువతకు ఉపాధి లభిస్తోంది.

అయితే ఈ ఉపాధికి భద్రత లేదు. ఎప్పుడు పని ఉంటుందో తెలియదు. ఆదాయం స్థిరంగా ఉండదు. పెట్రోల్ ఖర్చులు, వాహన మరమ్మతులు పోతే చేతికి వచ్చేది చాలా తక్కువ. పండుగలు, ప్రత్యేక రోజుల్లో కంపెనీలకు భారీగా ఆర్డర్లు వస్తాయి. గత కొత్త ఏడాది వేడుకల సమయంలో లక్షలాది ఆర్డర్లు నమోదయ్యాయి. కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నాయి. డెలివరీ భాగస్వాములు మా త్రం తమ సమస్యలపై నిరసన తెలుపుతున్నారు. తక్కువ ప్రోత్సాహకాలు, పని ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కం పెనీ యాజమాన్యాలు మాత్రం ఈ విమర్శలను తిరస్కరిస్తున్నాయి. ఉపాధి కల్పించడ మే తమ లక్ష్యమని చెబుతున్నాయి.

నిత్యం సవాళ్లు..

చట్టపరంగా చూస్తే డెలివరీ బాయ్స్ పరిస్థితి దారుణంగా ఉంది. వారిని కంపెనీలు ఉద్యోగులుగా గుర్తించడం లేదు. కేవలం స్వ తంత్ర కాంట్రాక్టర్లుగా పరిగణిస్తున్నాయి. దీనివల్ల కనీస వేతనం అందదు. పని గంటలపై నియంత్రణ లేదు. ప్రమాదం జరిగితే కంపెనీ నుంచి పరిహారం రాదు. సామాజిక భద్రతా చట్టంలో వీరి గురించి ప్రస్తావన ఉ న్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రభు త్వం పథకాలు ప్రకటించే వరకు వీరికి రక్షణ కష్టమే. కొన్ని రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కర్ణాటక, రాజస్థాన్ వంటి చోట్ల కొత్త నిబంధనలు వస్తు న్నాయి. డెలివరీ భాగస్వాములకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒకే రకమైన రక్షణ లేదు. వినియోగదారుల సౌకర్యం వెనుక ఒక వర్గం కష్టం దాగి ఉంది. కార్మికుల హక్కులను కా పాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ వ్యవస్థకు గౌరవం దక్కుతుంది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు ఇప్పుడు అత్యం త కీలకమైన భాగస్వాములుగా మారారు. నగరాల్లో నివసించే కోట్లాది మందికి ఆహా రం, నిత్యావసర వస్తువులను క్షణాల్లో చేరవేస్తున్న ఈ అదృశ్య సైన్యం జీవితాలు మా త్రం నిత్యం సవాళ్లతోనే సాగుతున్నాయి. తా జాగా జరిగిన దేశవ్యాప్త సమ్మెలు ఈ రంగంలోని లోపాలను ప్రపంచం ముందు ఉంచా యి. కేవలం 10 నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేయాలనే కంపెనీల ఒత్తిడి వర్కర్ల పాలిట యమపాశంగా మారుతోంది. ఈ వేగవంతమైన డెలివరీల వల్ల రోడ్లపై ప్రమాదాలు పెరగడమే కాకుండా, కార్మికులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

అల్గారిథమ్ నిర్దేశించే కఠినమైన గడువుల వల్ల వారు ప్రాణాలకు తెగించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే 10 నిమిషాల డెలివరీపై వస్తున్న విమర్శలపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. ఇళ్ల చుట్టుపక్కలో దుకాణాలు ఎక్కువగా ఉండడంతోనే 10 నిమిషాల డెలివరీని తీసుకొచ్చాము. కానీ దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతమాత్రం కాదు. ఈ విధానాన్ని గిగ్ వర్కర్లు తప్పుగా అర్థం చేసుకుం టున్నారు.

ప్రోత్సాహకాలు కరువు..

క్షేత్రస్థాయిలో గిగ్ వర్కర్ల ఇబ్బందులు వ ర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతిరోజూ 12 నుం చి 14 గంటల పాటు కష్టపడినా వారికి దక్కే ఫలితం నామమాత్రంగానే ఉంటోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, వాహన మరమ్మతులు, ఇతర ఖర్చులు పోను చాలామం ది కార్మికుల చేతిలో నెలకు పదివేల రూపాయల లోపే మిగులుతోంది. కనీసం వారా నికి ఒకరోజు కూడా విశ్రాంతి తీసుకోలేని దుస్థితి వీరిది. పండుగలు, భారీ వర్షాల స మయంలో ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వీరు మరింత కష్టపడాల్సి వస్తోంది. విశ్రాం తి తీసుకోవడానికి సరైన వసతులు లేక, రోడ్ల పక్కనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కోసారి కేవలం రెండు నిమిషాల ఆలస్యం కారణంగా కంపెనీలు వారి ఐడీలను నిలిపివేయడం లేదా భారీగా జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసు కుంటున్నాయి.

కంపెనీలు అందిస్తున్న ప్యాకేజీలు కార్మికుల అవసరాలను ఏమాత్రం తీర్చడం లే దు. వీరికి స్థిరమైన వేతనం అంటూ ఏమీ ఉండదు. కేవలం ఆర్డర్ల సంఖ్య, ప్రయాణించిన దూరం ఆధారంగానే చెల్లింపులు జరు గుతున్నాయి. కంపెనీలు తమను ‘స్వతంత్ర భాగస్వాములు’ అని పిలుస్తూ సామాజిక భద్రతా ప్రయోజనాల నుంచి తప్పించుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యం పాలైనప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు వీరి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొన్ని కంపెనీలు ప్ర మాద బీమా కల్పిస్తున్నప్పటికీ, అది క్లెయిమ్ చేసుకోవడంలో అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్స్) విషయంలో కూడా అస్పష్టమైన నిబంధనలు ఉండటంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సంక్షేమం అవసరం..

ప్రస్తుతం దేశంలో దాదాపు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లుగా ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 2.3 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ఈ శ్రామిక శక్తికి తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సామాజిక భద్రతా కోడ్ 2020 ద్వారా వీరిని గుర్తించినప్పటికీ, అమలులో జాప్యం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేస్తున్నా, అవి పూర్తిస్థాయిలో కార్మికులకు చేరడం లేదు.

అల్గారిథమ్ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, కనీస వేతన గ్యారంటీ కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం టెక్నాలజీ ఆధారంగానే కాకుండా మానవీయ కోణంలో వీరి సమస్యలను పరిష్కరి ంచినప్పుడే గిగ్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా మారుతుంది. భారత ప్రభుత్వం ఇటీవలే లేబర్ కోడ్‌లో గిగ్ వర్కర్లను సామాజిక భద్రతా పరిధిలోకి తెచ్చింది. అయితే పది నిమిషాల డెలివరీ వంటి చర్యలను నియంత్రించే నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు.

వ్యాసకర్త సెల్: 7842195755

రతన్ రుద్ర