15 April, 2026 | 9:33 AM

నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్!

20-12-2025 02:30 AM

ఒడిశా సీఎం మోహన్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఒడిశా నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీతో బేగంపేటలోని ఓ హోటల్‌లో భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందన్నారు. ఆ తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.