calender_icon.png 20 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ

20-12-2025 02:33:05 AM

కాలానికి అనుగుణంగా పనితీరు మారాలి

జిల్లా పీఆర్వోల వర్క్‌షాప్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): రెండేళ్ల పాలనలోనే ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాచార పౌర సం బంధాల శాఖ, మీడియా అకాడమీ కలిసి ప్రజాసంబంధాల అధికారులతో శుక్రవారం నాంపల్లిలో నిర్వహించిన వర్క్‌షాప్ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచారో, ఆ మార్పును కేవలం రెండేళ్లలోనే ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి-, సంక్షేమాలను పరుగులు పెట్టిస్తున్నామని తెలిపా రు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదవాడికి అండగా నిలిచామని తెలిపారు. ప్రతి రంగంలో ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయన్నారు. అయి తే, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి చేరడం లేదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ప్రజాసంబంధాల అధికారుల పాత్ర మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.

ప్రస్తుత మీడియా మార్పులకు అనుగుణంగా ప్రిం ట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించా రు. ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్వోలను నియమించాలని, ఇతర విభాగాల్లో ఉన్నవారి డిప్యూటేషన్లను రద్దు చేయాలన్నారు. అర్హులైన ఉద్యోగులకు ఉద్యోగోన్న తులు కల్పించాలని, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఐ అండ్‌పీఆర్ కమి షనర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీని వాస్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబా బు, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో జీ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి 

తెలంగాణ ఉద్యమకారులకు -250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల సంఘం విజ్ఞ ప్తి చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అములు చేయాలని కోరింది.  శుక్రవారం మంత్రి పొంగులేటిని ఉద్య మ కారుల సంఘం  వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటి స్థలం తో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చాలని కో రారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు బొమ్మెర స్టాలిన్,  బోరెల్లి సురేష్, నక్క మహేష్, జోగు గణేష్ , మీసాల మహే ష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.