calender_icon.png 20 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీకి ప్రత్యేక యాప్

20-12-2025 02:26:48 AM

నేటి నుంచి శ్రీకారం చుట్టనున్న వ్యవసాయ శాఖనేటి నుంచి శ్రీకారం చుట్టనున్న వ్యవసాయ శాఖ

రైతుల అవసరం మేరకే సరఫరా

ఇప్పటికే రైతులకు, ఎరువుల విక్రయదారులకు అవగాహన

మహబూబాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): యూరియా పక్కదారి పట్టకుం డా వ్యవసాయ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. పంటల సాగుకు అవసరమైన యూరియానే రైతులకు అందిం చేందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. తమ మొబైల్ ఫోన్ల నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న రైతులు పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఆ రైతుకు ఎంత యూరి యా అవసరం అవుతుందో తెలిసిపోతుంది. 

ప్రత్యేక యాప్ ద్వారా యూరి యా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ యాప్ విధానంపై  రైతులు, ఎరువుల విక్రయ దారులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పిం చింది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఎరువుల విక్రయ కేంద్రాల ద్వారా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేపట్టనున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా ఉండడంతో పాటు, పంటల సాగుకు అవసరమైన విధంగా వినియోగం, పంట విస్తీర్ణానికి తగ్గట్టుగా పంపిణీ, రైతులకు ఇబ్బందులు లేకుం డా చూడడానికి సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

24గంటల్లోపు..

 రైతులు మొబైల్ ఫోన్‌లోని ప్లే స్టోర్ ద్వారా  యాప్ డౌన్లోడ్ చేసుకొని, పట్టా పాస్ పుస్తకం, మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విస్తీర్ణానికి తగ్గట్టు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని, యూరియాను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఐడీ ద్వారా 24 గంటల్లోపు కేటాయించిన యూరియాను పొందవచ్చు. ఒకవేళ 24 గంటల్లోపు యూరియా తీసుకున్నట్లయితే తిరిగి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

వానాకాలం నుంచి నేరుగా ఇంటికే..

ఈ యాసంగి నుంచి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఫర్టిలైజర్ యాప్ ద్వారా చేపట్టనుండగా, ఇందులో తలెత్తే ఇబ్బందులను తొలగించి వచ్చే వానాకాలం కూడా పూర్తిస్థాయిలో యూరియాను యాప్ ద్వారా రైతులకు నేరుగా ఇంటికే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. యూరియానే యాప్ ద్వారా మిగతావి నేరుగా కొనుగోలుచేయవచ్చ న్నారు. అయితే రైతుల్లో చాలామందికి స్మార్ట్  ఫోన్లు లేకపోవడం, నిరక్షరాస్యత, ఇతర కారణాలు యాప్ వినియోగానికి కొంత అడ్డంకి ఉన్నట్లు పేర్కొంటున్నారు.

యాప్ నమోదు విధానం ఇలా..

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు 20.12.2025 నుంచి పంటకు కావల్సిన  యూరియా బస్తాలు తీసుకోవాలంటే తప్పని సరిగా ఫెర్టిలైజర్ (యూరియా) బుకింగ్ యాప్‌లో  బుకింగ్ చేసుకోవాలి.  రైతులు పంట నమోదులో నమోదు చేసిన మొబైల్ నంబరుతో  OTP ద్వారా ఆప్ లో లాగిన్ కావాలి.  ఆ తర్వాత తమ భూమి వివరాలు, పంటల వివరాలు (ఏ పంట, ఎన్ని ఎకరాలు విస్తీర్ణం) నమోదు చేయాలి.  వాటి ఆధారంగా నిర్ణీత బస్తాల యూరియా సంఖ్యను యాప్‌లో ముందుగా బుక్ చేసుకోవాలి.  యాప్‌లో  జిల్లాలోని అన్ని ఫెర్టిలై సర్ షాపుల్లో అందుబాటులో  ఉన్న యూరి యా బస్తాల సంఖ్య రైతుకి చూపిస్తుంది. పైవిధంగా యాప్‌లో బుక్‌చేసుకున్న రైతుల డీలర్లు లేదా సొసైటీల వద్ద యూరియా బస్తాలు తీసుకునే వీలుంటుంది.  ఒక దఫా యూరియా బస్తాలు తీసుకున్న రైతు రెండో దఫా బస్తాలు తీసుకోవడానికి కనీసం 15 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి.