calender_icon.png 15 May, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాదారులకు బిగుస్తున్న ఉచ్చు

15-05-2025 02:35:11 AM

ఒకవైపు ఇంటిలిజెన్సీ ఆరా... మరోవైపు మానసిక ఆందోళనలతో బాధితుడు ఆసుపత్రి పాలు 

భద్రాద్రి కొత్తగూడెం,మే 14 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండ లం గంగారం రెవెన్యూ గ్రామంలో కబ్జాదారులకు వచ్చు బిగిస్తుంది. గంగారం భూమా ఫియా పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందిన విషయం విధితమే. కేటీపీఎస్ డి ఈ స్థాయి అధికారి కుటుంబ సభ్యుల పేరుతో వందల ఎకరాల వ్యవహారం ఒక్కటొకటి వెలుగు చూస్తోంది.

దీంతో ముఠా సభ్యులకు గుండె ల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారులను తప్పుదోవ పట్టించి ఫోర్జరీ సంతకాల ఆధారంగా నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి ఆగడాలకు తెగబడుతున్నట్లు ఆధారాలతో సహా బయటికి రావడంతో భూమాఫియా తలలు పట్టుకుంటున్నాయి. అంతటితో ఆగకుండా భూమాఫియా  అక్రమాలపై ఇంటిలి జెన్సీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

1970 కంటే ముందు కొండపల్లి గో పాల్ రావు వద్ద కొనుగోలు చేసి నా భూములపై ఈ అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆగడాలకు తెగబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సంపత్ నగర్ గ్రామానికి చెందిన ఓ మహిళ 25 ఎకరాల భూమిపై కేటీపీఎస్ డిఈ సతీమణి కి నకిలీ పత్రాలు సృష్టించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.

గంగారం రెవెన్యూ పరిధిలోని సంపత్ న గర్ గ్రామంలో 50 సంవత్సరాల నుంచి అభినేని సాంబశివరావు అనే వృద్ధ రైతు 12. 08 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నాడు. 1968లో కొండపల్లి గోపాలరావు అనే వ్యక్తి నుంచి సాంబశివరావు కొ నుగోలు చేసినట్లు పహనీలు ఉన్నాయి. అ ప్పటినుంచి రెవెన్యూ రికార్డులో సాంబశివరావు పేరు కొనసాగు తోంది.

కబ్జా కోర్ల ముఠా ఆ భూమిపై కన్ను వేసి మరణించిన రైతుల నుంచి కేటీపీఎస్ లో డి ఈ గా పనిచేస్తున్న అధికారికి నకిలీ పత్రాలు సృష్టించి కొ నుగోలు చేసినట్లు రికార్డులను తారుమారు చేశారు. గత 17 సంవత్సరాల క్రితమే భూమి అమ్మకాలు కొనుగోలు జరిగినట్లు రికార్డులు తయారు చేశారు. రెడ్డి రామాయణం నుంచి తాటి లక్ష్మయ్య కొనుగోలు చేసినట్లు నకిలీ స్టాంప్ పేపర్లు ఫోర్జరీ సంతకాలు చేసి సిద్ధం చేశారు.

2017లో ఆ భూమిని కేటీపీఎస్ డీ ఈ కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించా రు. ఆ  నాన్ జ్యూడిషియల్ స్టాంపులు గుడివాడకు చెందినవి కావడంతో అనేక అను మానాలు వెలుగులోకి వచ్చాయి. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు తెలుసుకున్న సాంబశివరావు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

తన భూమిని కబ్జా చేస్తున్నారనే మానసిక ఆందోళనకు గురైన సాంబశివరావు ప్రస్తుతం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అనారోగ్య పరిస్థితికి భూ కబ్జానే కారణమని, తనకు ఏమి జరిగినా భూ కబ్జాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. జిల్లా అధికారు లు భూకబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తన భూమిని కాపాడాలని కోరుతున్నాడు.