28-08-2025 08:27:58 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha Kalvakuntla) ఎక్స్ వేదికగా కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురుతో మాట్లాడితే ప్రభుత్వ సహాయక చర్యలు పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని వారిని ప్రభుత్వం వెంటనే తరలించి తాత్కాలిక పునరావస చర్యలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.