28-08-2025 08:25:18 AM
చండూరు,(విజయక్రాంతి): విద్యార్థులకు, ప్రజలకు నేర్మట గ్రామానికిబస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి(Chandur Mandal Secretary) జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో విద్యార్థులకు, ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేర్మ ట గ్రామం నుండి సుమారు 200 మంది పైగా బోడంగిపర్తి పాఠశాలకు, మరోపక్క నల్లగొండకు పోయే విద్యార్థులకు, ప్రజలకు ఉదయం 8గంటలకు నల్లగొండకు పోవడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో విద్యార్థులకు, ప్రజల కోసం ఆర్టీసీ బస్సును వేసి బందు చేశారని, ఇప్పుడు ఆ బస్సును పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
అదే బస్సును ఉదయం ఎనిమిది గంటలకు నేర్మట నుండి బయలుదేరి వయా చండూరు నుండి, మునుగోడు, నల్లగొండకు, మళ్లీ సాయంత్రం నల్లగొండ నుండి, మునుగోడు, చండూరు, నేర్మటకు వచ్చే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉదయం నల్లగొండ నుండి ఎనిమిది గంటలకు నేర్మట మీదుగా చౌటుప్పల్ కు ఒకే ఒక బస్సు మా గ్రామం నుండి పోతుందని, మళ్లీ మా గ్రామం నుండి ఉదయం 8 గంటలకు నల్లగొండకు పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, సిపిఎం నాయకులు బల్లెం స్వామి, బొమ్మరగొని యాదయ్య, నారపాక శంకరయ్య, కలిమెర సైదులు, కొత్తపెల్లి వెంకన్న, హుస్సేన్, గ్రామ ప్రజలు ఓర్సు మల్లేశం, కడారి చంద్రయ్య, నారపాక దానయ్య,నారపాక మైసయ్య, నారపాక అనిల్, నారపాక లింగస్వామి, లక్ష్మమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.