calender_icon.png 27 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్‌లో చవితి శోభ

27-08-2025 02:55:05 AM

  1. కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిట
  2. పూలు, పండ్లు కొనడంలో భక్తులు బిజీ
  3. సాధారణ రోజులకంటే అధిక ధరకు అమ్మకాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు ౨౬ (విజయక్రాంతి): నేడు వినాయక చవితి సందర్భంగా మంగళవారం మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గణపతికి సమర్పించేందుకు పూలు, పండ్లు కొనేందుకు భక్తులు దుకాణాల వద్ద గుంపుగా కనిపించారు. పూలు, పండ్లతోపాటు వినాయకుడికి సమర్పించే పలు రకాల ఆకులు మార్కెట్‌లో దర్శనమిచ్చాయి. వాటిని అమ్మేందుకు గ్రామాల నుంచి అనేక మంది హైదరాబాద్ తరలివచ్చి, విక్రయించారు. సాధారణ రోజుల్లోకంటే మంగళవారం పూలు, పండ్లతోపాటు పూజసామగ్రిని అధిక ధరకు దుకాణదారులు విక్రయించారు.

ముఖ్యం గా బంతిపూల ధర మాత్రం ఆకాశాన్నంటింది. ప్రధానంగా ఓనకాయను రైతులు గ్రామాల్లో సేకరించి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు తెచ్చి విక్రయించారు. అంతేకాకుండా వినాయకుడి విగ్రహాల తయారీ కేంద్రాలు కూడా భక్తులతో సందడిగా మారాయి. కొందరు కొన్ని రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చిన విగ్రహాలను తీసుకెళ్లేందుకు ట్రాలీ ఆటోలు, డీసీఎంలు, ఇతర వాహనాలతో వచ్చారు. మరికొందరు బైక్‌లపై వచ్చి చిన్న చిన్న విగ్రహాలను కొని తీసుకెళ్లారు. అనేక రంగుల్లో ఉన్న గణపతి విగ్రహాలు ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఉన్నాయి. కాగా దేవుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలను కూడా కొని తీసుకెళ్లారు.