28-08-2025 08:42:06 AM
పొంగుతున్న వాగులు, నీట మునుగుతున్న పంటలు
మునిపల్లి: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు నీటిలో మునిగిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని లింగంపల్లి నుంచి బొడశట్ పల్లి వెళ్లే రోడ్డుపై ఉన్న వాగు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఉధృతి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తుగా రాకపోకలు నిలిపివేస్తున్నట్టు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వాగును సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ కొండాపూర్ సిఐ సుమన్, మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తదితరులు పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.