calender_icon.png 15 May, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సగం వెలుగు... సగం మలుగు

15-05-2025 02:33:16 AM

  1. సెంట్రల్ లైటింగ్ పై కొరవడిన పర్యవేక్షణ 
  2. జాతీయ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం
  3. ద్విచక్ర వాహన చోదకులు పాదచారులకు ఇక్కట్లు 

భద్రాద్రి కొత్తగూడెం మే 14 (విజయ క్రాంతి) రాజుల సొమ్ము రాళ్లపాలెం... ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలు అన్నట్లు ఉంది భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అధికారుల పనితీరు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెం ట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మా రింది. ఏ రహదారిపై ఉన్న సెంట్రల్ రైటింగ్ సగం వెలుగు... సగం మలుగు అన్న చందా న ఉంది. కొంత దూరం విద్యుత్ దీపాలతో చమ్మక్మని మెరిసే రహదారి,

చూస్తుండగానే కారు చీకటి కమ్ము కొని ఎదురుగా ఏమీ కనిపించని వైనం. దీంతో ఆ మార్గంలో ప్రయా ణించే ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. జగదల్పూర్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిలో పాల్వంచ పట్టణం ఇందిరా కాలనీ నుంచి లక్ష్మీదేవి పల్లె మండలం మొర్రేడు వాగు వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 

రూ కోట్లు వెచ్చించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసిన వాటి నిర్వహణపై అటు మున్సిపల్ అధికారులు, ఎటు పంచాయితీ అధికారులు ఏమీ పట్టనట్టు వ్య వహరిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నెలల తరబ డి ఇదే సమస్యను  ఎదుర్కోవాల్సి వస్తుంద ని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ని త్యం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఈ మా ర్గంలో రద్దీ అధికంగా ఉంటుంది.

ప్రజాప్రతినిధులు మంత్రులు అనునిత్యం రేయం పగ ళ్ళు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాపోతు న్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని సెంట్రల్ లైటింగ్ నిర్వహణపై దృష్టి సారించాలని, సక్రమంగా లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.