25-05-2025 10:10:10 PM
నారాయణఖేడ్: మన ఊరు మండల పరిధిలోని బోరంచ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి(MLA Dr. P Sanjeeva Reddy) ఆదివారం పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడనీ అణగారిన వర్గాల నుండి వచ్చినవారు అని వారికి వారి కష్టాలు అన్ని తెలుసని అందుకనే అణగారిన వర్గాల ప్రజల కోసం రాజ్యాగాన్ని రచించి రిజర్వేషన్లు తెచ్చి ఎంతో మంది జీవితలో వెలుగులు నింపారని ఉన్నారు.
అంబేద్కర్ ని స్పూర్తిగా తీసుకొని యువకులు ముందుకెళ్లాలని మంచి విద్య ఉపాధి అవకాశాలు పొందాలని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా మహిళలలు డిగ్రీ పూర్తి అయ్యే వరకు వారికి వివాహాలు చేయొద్దని వారి తల్లి తండ్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వారితో పాటు అనంతయ్య రిటైర్డ్ టీచర్, మాక్సుద్, దుర్గ ప్రసాద్, సంగన్న న్యాయవాది, గుండు పాటిల్, గుర్రపు మచేందర్, మారుతి, దీపక్ రెడ్డి, అఖిలేశ్ రెడ్డి, మల్లప్ప, దిలీప్ రెడ్డి, శ్రీకాంత్, ఆనంద్, జై భీమ్ ఆర్మీ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.