వీహెచ్ త్వరగా కోలుకోవాలి
03-07-2026 01:00 AM
పరామర్శించిన చిన్నారెడ్డి, జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూలై 2(విజయక్రాంతి): ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావును కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నేతలు గురువారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాం క్షించారు. మాజీమంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రాజు, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, బోయ వాల్మికి కార్పొరేషన్ వైస్‌చైర్మన్ నగేష్, బీసీ కమిషన్ మెంబర్ రాపోలు జయప్రకాష్‌తో పార్టీ నేతలు అంజన్‌బాబు, దుర్గేష్‌గౌడ్ తదితరులున్నారు.






