calender_icon.png 28 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపోరుకు పహారా..

28-01-2026 01:30:56 AM

సర్వసన్నద్ధమైన పోలీస్ యంత్రాంగం 

7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు..

1000కి పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ 

నగదు, మద్యంపై డేగకన్ను.. డీజీపీ బి.శివధర్ రెడ్డి  

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో శాంతిభద్రతల పరి రక్షణకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. అభ్యర్థులు, ఓటర్లు ఎలాంటి ఆందో ళనకు గురికాకుండా, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల భద్రతా ప్రణాళికను వివరించారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని డీజీపీ తెలిపారు. అక్రమ నగదు రవాణా, మద్యం, మాదకద్రవ్యాలు, ఓటర్ల ను ప్రలోభపెట్టే ఉచితాల పంపిణీని అడ్డుకోవడానికి ప్రత్యేక తనిఖీ కేంద్రాలు,ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్లు చెప్పారు. రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లే వా రు తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపాలి. లైసెన్స్డ్ ఆయుధాలన్నీ వెంటనే డిపాజిట్ చేయాలి.

అక్రమ ఆయుధాల ఏరివేతకు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాం అని ఆయన హెచ్చరించారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలోనే 1800 ఆ యుధాలను సేకరించినట్లు ఆయన గుర్తు చేశారు.రాష్ర్టంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగూడెం, కరీంనగర్, మహబూ బ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం, 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ , ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖలకు చెందిన సుమారు 2,000 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగించుకోనున్నట్లు డీజీపీ వివరించారు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.