calender_icon.png 6 December, 2024 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్దండలో యువ రైతు దారుణ హత్య

08-11-2024 03:50:25 PM

పొలం వద్ద కాపలాగా ఉండగా అర్ధరాత్రి బండరాళ్లతో మోది ఘాతుకం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): వేరుశనగ పంటను రక్షించేందుకు కాపలాగా వెళ్లిన యువరైతు దుండగుల చేతిలో అత్యంత దారుణంగా హత్య గవించబడ్డాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఎంజి కాలనీ తండాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాత్లావత్ రాజు(30) హిమబిందు ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికున్న పొలంలో వేరుశనగ పంట వేసుకొని వ్యవసాయ చేస్తున్నారు. గురువారం రాత్రి భోజనం అనంతరం వేరుశనగ పంటను అడవి పందుల నుండి కాపాడుకునేందుదుకు రాత్రి పొలం వద్ద కాపలాగా వెళ్లి అక్కడే నిద్రించాడు.

తెల్లవారుజామున ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య పొలం వద్ద వెతకడంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు బలమైన బండరాళ్లతో తలపై మోదీ అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు గుర్తించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.