calender_icon.png 19 December, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

18-12-2025 02:05:02 AM

రేగొండ, డిసెంబర్ 17 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళి యువకుడు మృతి చెందిన ఘటన రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనిపర్తి గ్రామానికి చెందిన మునిగాల రాజు (30) ముదిరాజ్ కులస్తుడు కాగా వృత్తి రిత్యా బుధవారం ఉదయం గ్రామ శివారులోని చలి వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాలికి చుట్టుకుని నీటిలో మునిగి మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య అనూష ఉండగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్త్స్ర కె.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.