18-12-2025 02:04:18 AM
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అ న్నారు. మూడు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులే అత్యధిక స్థానాల్లో విజ యం సాధించారని తెలిపారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్ర భుత్వ పాలనపై వ్య క్తం చేసిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతి బింబమన్నారు.
ఈ తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మా రిందన్నారు. పంచాయతీ ఎన్నికలను కాం గ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ విజయం వెనుక బలమైన వ్యూ హాలే కారణమన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే నినాదానికి ప్రజ లు పట్టం కట్టారని చెప్పారు.