20-08-2025 12:31:56 AM
పాలమూరు జిల్లా వ్యాప్తంగా మట్టి వినాయకుల తయారీ, విక్రయం
శ్రీకాంత్ చారిని ప్రశంసిస్తున్న పర్యావరణ మేధావులు
మహబూబ్నగర్ ఆగస్టు 19 (విజయ క్రాంతి) : వాతావరణాన్ని కలుషితం చేసే ప్లా స్టర్ ఆఫ్ పారిస్ (పిఓపి) వినాయక విగ్రహా ల కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా పిలుస్తున్నారు యువకుడు శ్రీకాంత్ చారి. మహ బూబ్నగర్ పట్టణంలోని శివశక్తి నగర్కు చెం దిన ఈ యువకుడు, 2010లో తన బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రారంభించిన.
ఈ ప్రయాణం ఇప్పుడు 16వ ఏ డాది లోకి అడుగుపెట్టింది. పండుగల సమయంలో నీటి మోహరాల్లో నిమజ్జనం చేయ బడే పిఓపి విగ్రహాల వల్ల జరిగే నీటి కాలుష్యాన్ని గమనించిన శ్రీకాంత్, పర్యావర ణాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో, మట్టి వినాయక విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. మట్టితో తయారైన విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోతాయి.
ఇవి నీటి జీవవ్యవస్థకు హాని కలిగించవు. అదే సమయం లో పిఓపి విగ్రహాలు మాత్రం రసాయనాలతో తయారవడం వల్ల జలవనరులను తీవ్రంగా కలుషితం చేస్తాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే శ్రీకాంత్ చారి తన లక్ష్యంగా పేర్కొంటున్నారు
మట్టి వినాయకులకు ప్రాధాన్యత
రోజురోజుకు పర్యావరణంలోకి ముప్పు వాటిల్లని మట్టి వినాయకులకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ తరుణంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంలో వందలాది విగ్రహాలను తానే స్వయంగా, కలకత్తా నుండి నైపుణ్యం కలిగిన కళాకారులతో తయారు చేయిస్తున్నాడు.
ఈ ప్రక్రియ ద్వారా అక్కడి కళాకా రులకు ఉపాధి కల్పిస్తూ, వారికీ ఆదరణనిచ్చే ఒక చిన్న శ్రమోధ్యమాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నాడు. తన సోదరుడు అనిల్ చారి సహకారంతో మట్టి విగ్రహాల విక్రయాన్ని మహబూబ్నగర్ శివశక్తి నగర్ శివా లయం వద్ద, గద్వాల్లోని సుంకులం మెట్టు గుడి పక్కన, కల్వకుర్తిలో అందరికీ ఆదర్శంగా ప్రకృతికి మేలు చేకూరు విధంగా విక్రయిస్తున్నారు.
ఐటి ఉద్యోగం చేస్తూనే.. విగ్రహాల తయారీ..
ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే శ్రీకాంత్ ఒక ఐటీ ఉద్యోగంలో కొన సాగుతూనే ఈ సాంస్కృతిక పర్యావరణ ఉ ద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. కలనీలోని యువత, పెద్దలంతా ఆయనను ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, ఈ ఉద్యమానికి తోడుగా నిలుస్తున్నారు. పండుగల్లో ఆనందించడమే కాదు, ప్రకృతిని పరిరక్షించాలన్న బాధ్యత మనపై ఉంది. మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిద్దాం.
ప్లాస్టిక్ పదార్థాలకు, పిఓపి విగ్రహాలకు పూర్తిగా నివాళి పలికే సమయం వచ్చింది‘ అంటూ శ్రీకాంత్ చారి ప్రజలకు సందేశం ఇస్తున్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలని కోరు తూ, స్థానిక స్థాయిలో ఒక ఉద్యమంగా మారిన ఈ చర్యను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ చర్య మరింత ము ందుకు అడుగులు వేస్తే భవిష్యత్తు లో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఉండే విగ్రహాల తయారీ మరింత రూపొందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.