calender_icon.png 20 August, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండభీమనపల్లి గ్రామ అభివృద్ధికి కృషిచేస్తా

20-08-2025 12:32:21 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, ఆగస్టు 19: దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి గ్రామంలో మంగళవారం అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పర్యటించారు.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరంకొండభీమనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు.గ్రామాల్లో ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.