06-08-2024 01:24:46 AM
న్యూ ఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. విచారణ సమయంలో కవిత తరఫు సీనియర్ న్యాయ వాదులు రాకపోవడమే వాయిదాకు కార ణం కావడం గమనార్హం. కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.
సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున మరో రోజుకు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. న్యాయవాదులు నితీశ్ రా ణా, మోహిత్‌రావు రాలేదని అని జడ్జి జస్టిస్ కావేరి బవేజ అడిగారు. ఇందుకు సమాధానం ఇస్తూ వారు కోర్టుకు హాజరు కాలే దని న్యాయవాది తెలిపారు.
దీంతో విచారణను ఈ నెల 7కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. వాదనలు విని పించకపోతే పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రెండుసార్లు వాయిదా పడింది. కాగా, 5 నెలలుగా కవిత ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఈరోజు ఆమెను కలిసేందుకు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.