24-07-2025 12:41:49 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఆడే ప్రకాష్(PRTU TS State Associate President) నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని, పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు కు కృషి చేస్తానని,317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, కెజిబివి, ఐటిడిఎ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగ ఉపాద్యాయులు MTS కోరకు కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏటుకూరి శ్రీనివాసరావు, సునార్కర్ అనిల్ కుమార్,మండల జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడె ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలిపారు.