calender_icon.png 26 July, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గానుగుపహాడ్- చిటకోడూరు వంతెనలు నిర్మించాలి...!

25-07-2025 11:16:27 PM

జనగామ,(విజయక్రాంతి): శుక్రవారం రోజు  జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు గానుగుపహాడ్- చిటకుడూర్ వంతెన నిర్మాణ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 28వ తారీఖు జనగామ కలెక్టర్ కార్యాలయం వద్ద గానుగుపహాడ్- చిటకుడూర్ బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో చేసే రిలే నిరాహారదీక్షలను విజయవంతం చేయాలని అన్నారు. గతం లో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన గానుగుపహాడ్ వంతెన పనులు సగంలో ఆగిపోయినాయి అని చిటకోడూరు వంతెన పనులు ప్రారంభం చేయాలని అన్నారు.