calender_icon.png 26 July, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్ డన్ జశ్వంత్

25-07-2025 11:04:25 PM

ఐఫోన్ దొరికితే పీఎస్లో ఇచ్చిన టెన్త్ స్టూడెంట్

చేవెళ్ల: రోడ్డుపై ఐ ఫోన్ దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి నిజాయతీని చాటుకున్నాడో స్టూడెంట్. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని సాయి చైతన్య స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న పామెనకు చెందిన జశ్వంత్ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్లేందుకు చేవెళ్ల బస్టాండ్ వద్దకు వచ్చాడు. అక్కడ రోడ్డుపై దాదాపు రూ. లక్ష విలువైన ఐఫోన్ దొరికింది. దాన్ని వెంటనే తీసుకెళ్లి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సీఐ భూపాల్ శ్రీధర్కు అప్పజెప్పారు. విద్యార్థి నిజాయితీని మెచ్చిన సీఐ.. అతన్ని వెల్ డన్ అని అభినందించారు.