25-07-2025 11:19:37 PM
మంథని,(విజయక్రాంతి): కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైనాల రాజును నియమిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. ఇప్పటికే కమాన్ పూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షడిగా రాజు కొనసాగుతున్నాడు. అలాగే ముత్తారం మండల అడవి రాంపూర్ కు చెందిన మద్దెల రాజయ్య ను వైస్ చైర్మన్ గా , సభ్యులుగా గుమ్మడి వెంకన్న, అబ్దుల్ రఫీక్, గుగులోతు ప్రవీణ్ కుమార్, పుల్లెల సతీష్, ఆరేళ్లి శ్రీనివాస్, దాసరి గట్టయ్య, ముసుగుల నరేందర్ రెడ్డి, జాగిరి సమ్మయ్య, సిద్ధం మురళి, బి బుచ్చారావు, గుండ భాస్కర్, సురభి జగన్ మోహన్ రావు, ఇనగంటి భాస్కరరావుల తో పాట జిల్లా మార్కెటింగ్ అధికారి, మంథని వ్యవసాయ ఏడి, కమాన్ పూర్ గ్రామ ప్రత్యేక అధికారి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వైనాల రాజు చైర్మన్ గా నియమితులు కావడంతో కమాన్ పూర్ మండల కంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు తన నియమానికి కృషిచేసిన మంత్రి శ్రీధర్ బాబుకు సోదరుడు శ్రీను బాబుకు వైనాల రాజు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.