calender_icon.png 12 July, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా ఆధార్ క్యాంపు ద్వారా 3,700కి పైగా ఆధార్ సమస్యలకు పరిష్కారం

12-07-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం,జులై 11, (విజయ క్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల మెగా ఆధార్ క్యాంపులు ప్రజల నుండి విశేష స్పందనను పొందాయి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒకప్రకటన లో తెలిపారు. మూడు రోజులపాటు జరిగిన ఈ మెగా క్యాంపు ద్వారా వేలాది మంది పౌరులు తమ ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకున్నారు అన్నారు.

మూడు రోజులు పాటు నిర్వహించిన ఈ మెగా ఆధార్ క్యాంపు ద్వారా మొత్తం కొత్త నమోదులు 489, వయోవృద్ధుల సేవలు 45, వికలాంగుల నమోదు 12, ట్రాన్స్జెండర్ నమోదు 1, బయోమెట్రిక్, ఇతర అప్డేట్లు 602, జనన తేదీ సవరణ లు 5, ఆధార్ రద్దు కేసులు 2 సాధారణ ఎంక్వయిరీలు సుమారు 50 మరియు మొత్తం  3,772 సమస్యలను పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

మూడు రోజులపాటు నిర్వహించిన ఈ మెగా ఆధార్ క్యాంపకు పదివేలకు పైగా ప్రజలు వచ్చారని ఆయన తెలిపారు. వారిలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి, ధ్రువీకరణ పత్రాలు తీసుకొని మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ నవీకరణ చేసుకోవాలని సూచించారు. చాలా రోజులుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో ఆధార్ సమస్యలను ఈ ఆధార్ కేంద్రం ద్వారా పరిష్కరించబడ్డాయని అన్నారు.

ఈ కార్యాక్రమం ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించడం ద్వారా వారి సమస్యలు తక్షణమే పరిష్కరమయ్యాయి అన్నారు. మండలాల వారీగా నిర్వహించే మెగా ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆధార సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు.

నీ మెగా ఆధార్ క్యాంపును విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన రాష్ట్ర యుఐడిఐ బృందం మరియు ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది మరియు ఐటీ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.