12-07-2025 03:16:46 PM
బుగ్గ దేవాలయం పూజారి వేణుగోపాల శాస్త్రి స్పష్ఠీకరణ
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): తన పై వచ్చిన ఆరోపణలు అన్నీ సత్య దూరమని బెల్లంపల్లి బుగ్గ దేవాలయం పూజారి శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి స్పష్టం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. తన ఉద్యోగానికి విఘాతం కలిగించే ఉద్దేశంతో కొందరు నిందలు వేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వాపోయారు.
బుగ్గ దేవాలయంలో తాను పూజారిగా పనిచేయడం ఇష్టం లేనివారు ఉద్దేశపూర్వకంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులతో గతంలో కూడా తనను అక్రమంగా సస్పెండ్ చేపించారని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు బుట్ట దాఖలు కావడంతోనే తన సస్పెండ్ ను రద్దు చేశారన్నారు. మళ్లీ తనపై సరికొత్త నిందలతో ఉద్యోగాన్ని తొలగించేందుకు కుట్ర జరుగుతున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తనపై అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.
నిజనిజాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు తెలుసునని పేర్కొన్నారు. బుగ్గ దేవాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న పోషమ్మ పూజారి శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి పై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఖండించారు. పూజారి ఏ తప్పు ఎరగడని తెలిపారు. గిట్టని వారు తమ ఉద్యోగాలను తొలగించేoదుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.