12-07-2025 02:51:17 PM
ప్రతి ఒక్కరు తప్పుడు ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి
సిసి కుంట ఎస్సై రామ్ లాల్ నాయక్
చిన్నదింతకుంట: సైబర్ నెరగాళ్లు నిత్యం నూతన విధానాలను అవలంబిస్తూ అమాయకుల బ్యాంకుల ఖాతాలనుంచి డబ్బులు కాళీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల వలలో కొంతమంది పడుతూనే ఉన్నారు. ఇలాగే కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఒకరి ఖాతా నుంచి రూ 18,50,000 మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నెరగల అంశానికి సంబంధించి సిసి కుంట పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ లాల్ నాయక్ ప్రత్యేకంగా విజయ క్రాంతితో సంభాషించారు.
గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్ల నుంచి గత నెల 19న గుర్తు తెలియని ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు మిస్ యాజ్ అయిందని, మీ ఖాతాలో డబ్బులు ఉండేవిధంగా చూసుకోవాలంటూ ఫోన్స్ కాల్స్ రావడం తో పాటు వారు అతన్ని నమ్మించడంతో ఫోన్ కు వచ్చిన విలువైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందించారు. అక్కడితో ఆగకుండా వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి విడతలవారీగా రూ.18,50,000 వరకు అర్‌టీజీఎస్ రూపంలో అపరిచిత ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు.
కొన్ని రోజులు గడిచింది. అతను నేరగాళ్ల ద్వారా మోసపోయానని తెలుసుకొని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె రామ్ లాల్ నాయక్ తెలిపారు. సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ డబ్బులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాళ్ళు మాటలు చెబుతున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ప్రజలు మోసపోతున్నారని ఒకటికి రెండు మార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీ నెంబర్లను అడుగరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..
సైబర్ నేరగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా మాయ మాటలతో మోసగిస్తారని, విద్యార్థినులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాంలాల్ నాయక్ పేర్కొన్నారు. ఏపీకే ఫైల్స్, ఎస్బీఐ యోనో, తదితర పేర్లతో వస్తున్న ఫేక్ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఓపెన్‌చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరుతుందన్నారు. అపరిచితులు కాల్‌చేసి ఓటీపీ అడిగితే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రైజ్‌మనీ తగిలిందని, ప్రభుత్వ పథకాలు అందాయా, పోలీసులు మీపై కేసులు నమోదు చేశారని చెప్పేమాటలను నమ్మవద్దని తెలిపారు. యాప్‌పై స్నేహితులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని సూచించారు.