calender_icon.png 12 July, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు

12-07-2025 03:21:41 PM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జిల్లెల్లలో 26 ఇందిరమ్మ ఇండ్ల పత్రల పంపిణీ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరు పత్రాలు ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... లబ్దిదారులు వారికి కేటాయించిన ఇండ్లలోకి వెంటనే వెళ్ళాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాళ్లపేట గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు  మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై పీడీ హౌసింగ్, ఎంపీడీఓను అభినందించారు.

మట్టి కోసం ఆందోళన చెందవద్దు

మట్టి కోసం లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ గ్రామంలోని చెరువు, తమకు సంబంధించిన పొలంలో ఉన్న మట్టిని వినియోగించుకునేందుకు గ్రామ పంచాయితీ కార్యదర్శి ద్వారా తహశీల్దార్ కు తెలిపితే ఆయన అనుమతి తీసుకున్న తర్వాత ఆ మట్టిని గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.