calender_icon.png 12 July, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలాలపై ఆక్రమణల కూల్చివేత

12-07-2025 12:00:00 AM

  1. వరద ముంపు నివారణకు రంగంలోకి హైడ్రా
  2. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌లో అక్రమాల తొలగింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): నగరంలో వర్షాకాలంలో వరద ముంపును నివారించేందుకు హైడ్రా నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిం ది. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు శుక్రవారం రంగంలోకి దిగారు. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ నాలా, ఖైరతాబాద్ పరిధిలోని బుల్కాపూర్ నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు.

ఒకప్పుడు శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ప్రారంభమై, ఐటీ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ, హుస్సేన్‌సాగర్‌లో కలిసే చారిత్రక బుల్కాపూర్ నాలా, కాలక్రమేణా ఆక్రమణలకు గురైంది. తుమ్మలబస్తీ ఆనందనగర్ మధ్య 8 మీటర్లు ఉండాల్సిన నాలా కేవలం 5 మీటర్లకు కుంచించుకుపోయింది. దీంతో చిన్నపాటి వర్షానికే వరదనీరు సాఫీగా ప్రవహించక తుమ్మలబస్తీ, ఆనందనగర్ కాలనీలు ముంపునకు గురవుతున్నా యని స్థానికులు ఫిర్యాదు చేశారు.

స్పందించిన హైడ్రా బృందాలు, నాలాపై శ్రీధర్ ఫంక్షన్ హాల్ నిర్మించిన ప్రహరీని కూల్చివేశాయి. సమీపంలోని నివాసితులు తమ ఆక్రమణలను స్వయంగా తొలగించుకుంటామని కోరడంతో, వారికి కొద్దిరోజులు గడు వు ఇచ్చారు. దీంతో పాటు ఖైరతాబాద్ చౌర స్తా వద్ద కల్వర్టుకు అడ్డంగా ఉన్న వ్యర్థాలను తొలగించి, వరద ప్రవాహానికి మార్గం సుగమం చేశారు.

కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు నుంచి మొదలయ్యే నాలా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 7 మీట ర్ల వెడల్పు ఉండాల్సిన ఈ నాలా చాలాచోట్ల 2 మీటర్లకే పరిమితమైంది. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద కేవలం మీటరున్నరకు కుంచించుకుపోయింది.

ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు హబీబ్‌నగర్, శ్రీహరినగర్, శివశక్తి నగర్లలో నడుంలోతు నీళ్లు నిలుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో, నాలాను ఆక్రమిం చి నిర్మించిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌కెఎన్.ఆర్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలను హైడ్రా తొలగించింది.