calender_icon.png 12 July, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

12-07-2025 03:01:53 PM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల,(విజయక్రాంతి): ప్రజల అవసరాలను తీర్చేందుకు గాను  ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని  దౌదర్ పల్లి  సమీపంలో  రూ 2 కోట్ల వ్యయం తో  10 లక్షల లీటర్ల ట్యాంక్ ను నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్  భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గద్వాల జిల్లా కేంద్రంలో అమృత్  పథకంలో భాగంగా నూతన వాటర్ ట్యాంక్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.

దీని వల్ల గద్వాల పట్టణంలోని ప్రజలకు నీటి సమస్య లేకుండా ఉండే విధంగా  రాబోయే 30, 40 సంవత్సరాలు దాకా ఎలాంటి నీటి సమస్య ఉండకుండా ప్రజలకు వేసవి కాలంలో కూడా నీళ్లను లభించే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. గద్వాల నియోజకవర్గం ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతున్నమన్నారు.