11-07-2025 11:26:22 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి పట్టణ అధ్యక్షులు తురుపాటి రాజు ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కట్ చేసిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగారని, భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన విస్తరించడంలో బండి సంజయ్ కృషి ఏనలేనిదని కొనియాడారు.
కార్యకర్తలకు భరోసా కల్పించడంలో మంత్రి ముందుంటున్నారని, జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిలకు 20వేల సైకిళ్లు పంపించేసిన గొప్ప మానవతావాది బండి సంజయ్ అన్నారు. అయినను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త కష్టపడి రానున్న రోజుల్లో బిజెపినిఅధికారంలోకి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.