calender_icon.png 15 July, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం ఆధార్ క్యూ!

15-07-2025 12:00:00 AM

  1. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల రైతులకు ఒకేచోట పంపిణీ 
  2. ఉదయం నుంచి ఎండలో నిరీక్షించిన రైతులు

మహబూబాబాద్, జూలై 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ మండలా లైన కొత్తగూడ, గంగారం రైతు లు యూరియా కోసం ఆధార్ కార్డుతో క్యూ కట్టారు. కొత్తగూ డ, గంగారం మండలాల రైతులకు సోమవారం పొగుళ్లపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం ఒక లారీ, ఆదివారం మరొక లారీ యూరియా లోడ్ రాగా, సోమవారం ఉద యం నుంచే రైతులు యూరియా కోసం వివిధ గ్రా మాల నుంచి సొసైటీ వద్దకు వచ్చారు. రైతులు క్యూ లైన్‌లో గంటల తరబడి నిరీక్షించలేక తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులను క్యూ లైన్‌లో పెట్టి వాటి పక్కనే కూర్చుని నిరీక్షించారు.

ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ, సొసైటీ సిబ్బంది అక్కడికి వచ్చి గంగారం మండలానికి చెందిన రైతులకు 5 బస్తాలు, కొత్తగూడ మండల రైతులకు ఒక్కొక్కరికి మూడు బస్తాల చొప్పున 888 బస్తాల యూరియా పంపిణీ చేశారు.

గంగారం నుంచి కొత్తగూడ మండలానికి యూరియా కోసం రైతులు రావడం వల్ల దూరభారం పెరగడంతో పాటు, ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఏడీఏ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి, గంగారంలో పొగుళ్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా ఎరువుల విక్రయ కేంద్రాన్ని రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేసి అక్కడే యూరియా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడ ఏవో ఉదయ్ తెలిపారు.