15-07-2025 06:33:30 PM
ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ లాల్ సింగ్
చిలుకూరు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ చూసుకోవాలని ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ లాల్ సింగ్ అన్నారు. చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ పౌండేషన్ మౌలానా మైబూబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ లాల్ సింగ్ చేతుల మీదుగా మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మొక్కలు నాటడం చాలా సంతోషకరమైన విషయం అని నాటిన మొక్కలకు రోజు నీళ్లు పోసి సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిదని అలాగే ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటినట్లయితే స్కూల్ తో పాటు గ్రామం కూడా పచ్చదనంతో ఉంటుందని అన్నారు.
అదేవిధంగా గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలో గతంలో కూడా మొక్కలు నాటించడం జరిగిందని వాటి సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకున్నామని ఈరోజు నాటే మొక్కల సంరక్షణ కోసం గ్రామ పంచాయతీ తరపున వ్యక్తిని నియమిస్తున్నామని విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ లను ఇమ్రాన్, మౌలానా మైబూ బీ, ట్రస్ట్ చైర్మన్ మధునా బేగం దంపతులను శాలువతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ పౌండేషన్ తరపున 300 మొక్కలను వివిధ ప్రాంతాలలో నాటినామని అన్నారు.