calender_icon.png 16 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీన్మార్ మల్లన్నపై దాడి సిగ్గుచేటు

15-07-2025 05:53:51 PM

జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్

మందమర్రి,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని  అంబేద్కర్ విగ్రహం ముందు మంగళ వారం జాతీయ బీసీ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్ మాట్లాడారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల కోసం ఆలోచించని వాళ్ళు నేడు బీసీల పట్ల కపట ప్రేమను చూపిస్తూ బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీ బిడ్డ మీద చేసిన దాడిని బీసీ లందరు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. తెలంగాణ యాస, భాషల పట్ల అవగాహన లేని వాళ్ళు నేడు బీసీ బిడ్డ చట్ట సభల్లో కూర్చుంటే ఓర్వలేక అనగ దొక్కే కుట్రలను  తెలంగాణ సమాజం  గమనిస్తుందని, ఇకనైన వారి వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.