calender_icon.png 15 July, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్లాస్టిక్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

15-07-2025 06:13:18 PM

తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న డ్రైవర్, క్లీనర్

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం-అక్కంపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి లారీ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన లారీ ప్లాస్టిక్ లోడుతో భువనగిరి నుండి చిట్యాల వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బేరింగ్లు పట్టి వేయడంతో మంటలు చెలరేగి లారీకి అంటుకున్నాయి.

కాగా లారీకి అంటుకున్న మంటలను  రోడ్డుపై వెళ్తున్న కారులో ఉన్నవారు డ్రైవర్ తెలియజేయడంతో వెంటనే ఇంజన్ ఆపివేసి డ్రైవర్, క్లీనర్ లారీ నుండి బయటికి దూకి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే  సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు ఎంతో శ్రమించినప్పటికీ ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో లారీ పూర్తిగా కాలి బూడిదైంది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.