15-07-2025 06:49:44 PM
నాగార్జున సాగర్,(విజయక్రాంతి): అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న "బుద్ధునితో నా ప్రయాణం" అనే నాటకాన్ని వీక్షించడానికి మంగళవారం బుద్ధవనం సిబ్బంది తరలి వెళ్లారు. తెలంగాణ, ఆంధ్రాలో బుద్ధ ధర్మ ప్రయాణం అనే కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య ప్రాంతాలలో బుద్ధుని తో నా ప్రయాణం అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సూచన మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి బుద్ధవనం అధికారులు,సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన పంచాశీల జెండా ఊపి ప్రారంభించారు.